కొండపి: ఉగ్రదాడిలో మరణించిన వారికి సింగరాయకొండలో నివాళులర్పించిన హిందూ, ముస్లిం, క్రైస్తవ వేదిక సభ్యులు
సింగరాయకొండలో పహల్గాంలో ఉగ్రవాది దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ హిందూ, ముస్లిం, క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వత్తులతో ఆదివారం రాత్రి శాంతియుత యువత ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం పేరుతో అమాయకులైన ప్రజలను హతమార్చడం హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని నినదించారు.