గిద్దలూరు: కొమరోలు వెలుగు కార్యాలయంలో కిషోర్ వికాసం కార్యక్రమంలో భాగంగా మైనర్ బాలికల వివాహాలను అడ్డుకునే అంశంపై చర్చ
మార్కాపురం జిల్లా వెలుగు కార్యాలయంలో కిషోర్ వికాసం కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంత కుమారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. పోలీసులు, విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. 18 సంవత్సరాల దాటకుండా బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్య నేరమవుతుందని వసంత కుమారి హెచ్చరించారు. వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు వివాహం జరిపించిన పెద్దలు కూడా నేరస్తులు అవుతారని ఆమె తెలిపారు.