యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో కలకలం రేపిన మాజీ మంత్రి సురేష్ ఫ్లెక్సీలు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పై మళ్లీ ఆదిమూలపు సురేష్ కన్నేశారనే టాక్ వినిపిస్తుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో భారీగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫోటో లేకుండా సురేష్ ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో వైవి సుబ్బారెడ్డి ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. దీంతో వారి మద్దతు సురేష్కున్నట్టు ప్రచారం జరుగుతుంది. సురేష్ మళ్లీ వైపాలెం బాట పడతారా అని చర్చ మొదలైందని స్థానిక ప్రజలనుకుంటున్నారు.