మార్కాపురం: నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతపై సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత అధ్యక్షతన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన ప్రాంతంలో నీటి కష్టాలు ఏమిటో అందరికి తెలుసునని ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసామన్నారు. ప్రస్తుతం వర్షం పడటంతో బోర్లకు నీళ్ళు వస్తున్నాయన్నారు. నీటి సమస్యను అధికమించేందుకు జలధార జలహారతి కార్యక్రమం చేస్తున్నామన్నారు.