రాయదుర్గం: వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ మెట్టుగోవిందరెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టిన టిడిపి నేతలు
రాయదుర్గానికి చుట్టపుచూపుగా వచ్చి ఇక్కడ కార్యకర్తలు చెప్పే అవాస్తవాలు విని ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులుపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి అవాకులు చవాకులు పేలడం సరైందికాదని తెలుగుదేశం పార్టీ నేతలు హితులు పలికారు. రాయదుర్గం టిడిపి కార్యాలయంలో టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, టౌన్ ఇన్చార్జ్ టంకశాల హనుమంతు, మాజీ వైస్ చైర్మన్ కడ్డిపూడి మహబూబ్ బాషా, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.