మార్కాపురం: జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కి శాస్రోత్తకంగా కళ్యాణం జరిపారు. కార్యక్రమంలో ఉభయ దాతలు భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.