కొండపి: జరుగుమల్లి మండలంలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పరారైన దొంగ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సతుకుపాడుకి చెందిన ఓ మహిళ బైక్పై ఒంగోలు నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో వావిలేటిపాడు దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు మెడలోని బంగారు చైను, నల్లపూసలదండ తెంచుకొని వెళ్లిపోయారు. అయితే వారు పల్సర్ బైక్పై జరుగుమల్లి వైపు వెళ్లినట్లు బాధిత మహిళ తెలిపారు. నల్లపూసదండలో కొంతభాగం తానుపట్టుకోవడంలో తనవద్ద మిగిలిందన్నారు. అనంతరం ఆమె జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.