రాయదుర్గం: HLC కాలువ మరమత్తులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి : ఎమ్మెల్యే
తుంగభద్ర ఎగువకాలువ పరిధిలో ఈ ఏడాది రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన శాశ్వత, తాత్కాలిక మరమ్మత్తు పనులను జూన్ నెలాఖరు లోపు పూర్తి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాయంత్రం కణేకల్లు సమీపంలోని చెరువు వద్ద జరుగుతున్న ఔట్ ఫాల్ రెగ్యూలేటరీ పనులను ఆయన పరిశీలించారు. కాలువ ద్వారా రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.