రాయదుర్గం: కణేకల్లు లో సామాన్యుడి ఆవేదన
అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా కణేకల్లు మండల కేంద్రానికి సరైన దారి సౌకర్యం లేకుండా పోయిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో సోమవారం వైరల్ అయింది. 1964 లో ఏర్పాటైన హెచ్ఎల్సీ బ్రిడ్జిపై గత కొంత కాలంగా బస్సులు రాకపోకలను హెచ్ఎల్సీ అధికారుల ఆపేశారు. దీనివల్ల మండల కేంద్రానికి వచ్చి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్రిడ్జిపై రాకపోకలు అనుమతించాలని కోరారు.