యర్రగొండపాలెం: దోర్నాల ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల యొక్క సమస్యలను అర్జీ రూపంలో ఆయనకు అందజేశారు. స్వయంగా వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు.