రాయదుర్గం: పట్టణంలోని ఘనంగా జామియా మొహమ్మదియా అరేబియా కళాశాల 100వ వార్షికోత్సవం
రాయదుర్గం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న జామియా మొహమ్మదియా అరేబియా కళాశాల 100వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. షార్జా ఇస్లామిక్ స్కాలర్ షేఖ్ జఫరుల్ హసన్ మదని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డా. ఆసిమ్ ఖాన్ సనాబిలి మదని, వక్తగా షేఖ్ జావాద్ ఉమర్ జమాయి హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన, బహుమతుల పంపిణీ, మ్యాగజైన్ ఆవిష్కరణ, వార్షిక నివేదిక అనంతరం ఉలేమాలు సందేశం ఇచ్చారు. హిఫ్జ్ కోర్సు పూర్తి చేసిన 7 మంది విద్యార్థులు, ఆలిమియత్ కోర్సు పూర్తి చేసిన 22 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ల ప్రధానం చేశారు.