మార్కాపురం: డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం సిఐ అల్తాప్ హుస్సేన్ హెచ్చరిక
మార్కాపురం సిఐ కార్యాలయంలో దస్తావేజులేఖర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల భూ సమస్యలు ఎక్కువ అయ్యాయని దస్తావేజులేఖర్లు డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు భూముల రిజిస్ట్రేషన్ లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.