రాయదుర్గం: తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి దర్నా చేపట్టిన మహిళలు
రాయదుర్గం పట్టణంలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి దర్నా చేశారు. 16 వ వార్డు మధు టాకీస్ ఏరియాలో గత పది రోజులుగా తాగునీరు సరఫరా లేకపోవడంతో మహిళలు మూకుమ్మడిగా శనివారం సాయంత్రం లక్ష్మీబజార్ పైకి వచ్చి రోడ్డు కు అడ్డంగా నిలబడి రాస్తారోకో నిర్వహించారు. దీంతో మెయిన్ రోడ్డు పై ట్రాఫిక్ స్తంభించింది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.