మార్కాపురం: రాయవరం గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థినీలతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. విద్యార్థులు అందరూ సదువుపైనే దృష్టి పెట్టాలని మరే ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళవద్దని సూచించారు. ఉన్నత చదువుతూనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థినీలకు విద్య మెలకువలను బోధించారు