కొండపి: సింగరాయకొండ లోని వెంకటేశ్వర కాలనీవాసులు నిరసన, తమ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని డిమాండ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని వెంకటేశ్వర కాలనీవాసులు సెల్ టవర్ నిర్మాణం పనులను నిలిపివేయాలని నిరసనకు దిగారు. ఎస్సీ కాలనీలోని నివాసాల వద్ద సెల్ టవర్ నిర్మించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.