రాయదుర్గం: జనగణన పక్కాగా చేపట్టాలి : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
జనగణ పక్కాగా చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ దివాకర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గురి ఏరియాలో జరుగుతున్న సెన్సెస్ ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ లకు పలు సూచనలు చేశారు. ఇంటికిదగ్గరకు వచ్చే సిబ్బందికి పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి కమీషనర్ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహులు, టిపిఎస్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.