విశాఖపట్నం: ఏపీలో మారిటైమ్, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్: మంత్రి లోకేష్ ప్రతిపాదన
విశాఖపట్నంలో సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు, జువ్వలదిన్నెలో ఎక్స్పోర్ట్ హబ్ అభివృద్ధి సహా పలు కీలక అంశాలపై చర్చించారు.