గిద్దలూరు: గిద్దలూరు మండలం జయరామపురం గ్రామ సమీపంలోని ఎర్రవాగు వద్ద ప్రభుత్వ భూమిలో వేప చెట్లు నరికి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం జయరామపురం గ్రామ సమీపంలోని ఎర్ర వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వేప చెట్లను నరికి వేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలము చేరుకుని పరిశీలించిన అధికారులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం భూమిలో ఉన్న దాదాపు 100 చెట్లను వేప చెట్లను 50 సంవత్సరాలకుపైగా వయసు ఉన్న వాటిని నరికి వేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.