తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి మండల పరిధిలోని సజ్జలదిన్నెలో శుక్రవారం పంచాయితీ అధికారులు, సిబ్బంది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంచాయతీ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మురికి, చెత్తాచెదారాన్ని తొలగించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని పంచాయతీ అధికారులు గ్రామస్తులకు సూచించారు.