కళ్యాణదుర్గం: నా భర్త పరిటాల రవీంద్ర చనిపోయిన క్లిష్ట సమయంలో హనుమంతరాయ చౌదరి అండగా నిలిచాడు: కళ్యాణదుర్గంలో రాప్తాడు ఎమ్మెల్యే సునీత
మాజీ ఎమ్మెల్యే దివంగత హనుమంతరాయ చౌదరి నా భర్త పరిటాల రవీంద్ర చనిపోయిన క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచాడని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కళ్యాణదుర్గంలో ఆదివారం హనుమంతరాయ చౌదరి సంస్మరణ సభ జరిగింది. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో పరిటాల సునీత మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడ్డాడన్నారు. ఆయన భౌతికంగా లేకపోవడం బాధగా ఉందన్నారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామన్నారు.