తాడిపత్రి: పెద్దవడుగూరులో గంగన్న అనే రైతుకు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు
పెద్దవడుగూరు మండల కేంద్రంలోని గంగన్న అనే రైతుకు చెందిన గడ్డి వామికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు గమనించి బాధిత రైతుకు సమాచారం ఇచ్చారు. బాధిత రైతు స్థానికులతో కలిసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.