గిద్దలూరు: పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం
పశ్చిమ ప్రకాశం ప్రాంతాలలోని మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, పుల్లలచెరువు ప్రాంతాలలో ఆదివారం బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టంగుటూరు, ఒంగోలు, సింగరాయకొండ, కొండేపి ప్రాంతాలలో కూడా విపరీతంగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో చెట్లు కూడా నేలకొరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో వర్షం కొనసాగుతుంది.