మార్కాపురం: పట్టణంలో 73 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసామని తెలిపిన కమిషనర్ నారాయణరావు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో బి ఎల్ వో లు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో బి ఎల్ వో లకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో సుమారు 53 పోలింగ్ స్టేషన్ పరిధిలో 73% డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను బిఎల్ఓ లకు ఇచ్చి సహకరించాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల పదేపదే వారిని తిప్పుకోకుండా వంద శాతం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని కోరారు.