మార్కాపురం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సిఐ ఆల్తాఫ్ హుస్సేన్
మార్కాపురం సర్కిల్ పరిధిలోని ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. పోలీసులమని బ్యాంకు ఉద్యోగులమని ఓటీపీ లను అడిగినప్పుడు చెప్పి మోసపోవద్దు అన్నారు. మోసపూరిత ఆన్లైన్ షాపింగ్ చేయవద్దన్నారు. మొబైల్లో తెలియని ఏపీకే లింకులను ఓపెన్ చేయొద్దు అన్నారు. అలాంటి లింకులు ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలలో ఖాళీ చేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాబ్ పేరిట మోసాలు జరుగుతున్నాయని యువత అవగాహన కలిగి ఉండాలన్నారు.