కళ్యాణదుర్గం: యాటకల్లులో నూతన శివాలయం ప్రారంభం, హాజరైన మాజీ ఎంపీ తలారి రంగయ్య
సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరయ్యారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజ సంభ, శివలింగ, నంది విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా గోపుర కలశ స్థాపన కూడా నిర్వహించారు. మాజీ ఎంపీ రంగయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.