రాయదుర్గం: వేపరాళ్లలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల గ్రామంలో ఉప్పర రమేష్ (34) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు మద్యం తాగే అలవాటు ఉంది. ఇటీవల కాన్పు కోసం తన బార్య పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఏమి జరిందో గానీ గురువారం అతిగా మద్యం తాగాడు. సాయంత్రం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి బందువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.