కళ్యాణదుర్గం: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: కుందుర్పిలో ఎస్సై మహేష్
మైనర్లు వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని కుందుర్పి ఎస్ఐ మహేష్ హెచ్చరించారు. కుందుర్పి మండలం వ్యాప్తంగా పోలీసులు శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాలు నడుపుతున్న పలువురు మైనర్లను, వారి తల్లిదండ్రులను శనివారం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకమీదట మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.