మార్కాపురం: చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలపాలని బిజెపి మహిళా మోర్చా పిలుపు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారి శక్తి వందన్ అధినియమ్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ఉభయ సభల్లో దేశంలో ఎక్కువమంది మహిళలు ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు 16వ తేదీ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చరిత్రత్మక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంగా దేశంలోని మహిళలంతా మద్దతు తెలపాలని కోరారు. భారత ప్రధానమంత్రి చిరకాల వాంఛ మహిళల చిరకాల స్వప్నం సాకారం చేయడానికి ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు