కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో గాంధీ సర్కిల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గంలో గాంధీ సర్కిల్ అభివృద్ధికి ఎమ్మెల్యే సురేంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే భక్త కనకదాస సర్కిల్, వాల్మీకి సర్కిల్ లను అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. భక్త కనకదాస సర్కిల్, వాల్మీకి సర్కిల్ తో పాటు గాంధీ సర్కిల్ ను కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారు. గాంధీ సర్కిల్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మంగళవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు గాంధీ సర్కిల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కొత్త గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.