కొండపి: కొండపిలో బుధవారం జరిగిన వేలంలో 153 పొగకు బెల్లు తిరస్కరణకు గురి కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం చౌటుపాలెం, దాస రెడ్డిపాలెం, దాదానాయుడుపాలెం, కొండపి గ్రామాల నుంచి రైతులు 284 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా.. 131 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 153 బేళ్లు తిరస్కరించారు. మొదట రౌండ్ పూర్తయి రెండవ రౌండ్ కొనసాగుతోంది. రెండవ రౌండ్ లోనైనా తిరస్కరణల సంఖ్య కొనసాగుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది.