మార్కాపురం: జిల్లా కేంద్రంలో చెరువుకు సంబంధించిన అక్రమాలను తొలగించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం చెరువుకు సమీపంలో 35 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇతరుల ఆక్రమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో చిరంజీవి సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. చెరువుకు సంబంధించిన భూమిగా నిర్ధారించుకొని అక్రమాలను తొలగించారు. ఆక్రమించుకున్న వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చిరంజీవి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు పాలుపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.