యర్రగొండపాలెం: దోర్నాలలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో గోవిందామాంబ సమేత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ అభిషేకాలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం 80 సంవత్సరాల పాత గుడిని ఉద్వాసన చేసి నూతన గర్భగుడికి పైకప్పు నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.