యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం తోకపల్లి, గొబ్బూరు వద్ద రెండు బొలెరో వాహనాలు ఢీ, ఓ వాహన డ్రైవర్ కి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోక పల్లి, గొబ్బూరు గ్రామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టమాట లోడ్ తో వెళ్తున్న రెండు బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో గాయపడ్డ వ్యక్తిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.