కొండపి: సింగరాయకొండ ఊళ్ల పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన వర్షితకు టెన్త్ క్లాస్ పరీక్షలలో 588 మార్కులు
ఇవాళ విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సానిమిని శ్రీవర్షిత 588 మార్కులు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి రాంబాబు సాధారణ కారు డ్రైవర్గా ఉన్నారు. కార్పొరేట్ పాఠశాలకి ధీటుగా మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలిపారు.