మార్కాపురం: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మార్కాపురం ఆర్ అండ్ బి కార్యాలయం ముందు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ... ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుంది ఏ హామీని సరిగా అమలుపరచలేదన్నారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేయాలన్నారు