కొండపి: కొండపిలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైసీపీ శ్రేణులు నిరసన,తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించిన నాయకులు
ప్రకాశం జిల్లా కొండపి లో సోమవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైసిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దారులకు వైసిపి నాయకులు విన్నతి పత్రాన్ని సమర్పించారు. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీలో అదనంగా పెట్రోల్, డీజిల్ రూ.3 ఉండడాన్ని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏపీలో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనక పోవడంపై పుకార్లు వినిపిస్తున్నాయి.