గిద్దలూరు: సూర్య ఘర్ పథకం మంత్రి రవికుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పెద్ద యాచవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన సూర్య ఘర్ పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ విజయ సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లాకు 402 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ ప్రజలకు అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు.