మార్కాపురం: అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదులు
మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలను గత ప్రభుత్వం హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువై తరగతి గదులు సరిపోకపోవడంతో నాడు నేడు లో భాగంగా సమీపంలో ఉన్న మున్సిపల్ స్థలంలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టారు. దాదాపు పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి.