యర్రగొండపాలెం: తన కూతురితో ఓ యువకుడు సన్నిహితంగా ఉన్నాడని చంపి ఆనవాలు లేకుండా ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో తన కూతురితో ఓ యువకుడు సన్నిహితంగా ఉన్నాడని చూసిన తల్లిదండ్రులు ఆ యువకుడి పై దాడి చేసి అక్కడికక్కడే చంపి వేశారు. ఆ తర్వాత ఒకరోజు ఇంట్లోనే ఉంచుకొని మరుసటి రోజు ఆనవాళ్లు దొరకుండా పందులు కోసే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి బోరు బావిలో వేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు టెక్నాలజీ సహాయంతో గుర్తించి యువకుడు ఆంజనేయులు ను చంపిన వెంకటనారాయణ రమణను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ నాగరాజు వివరాలను వెల్లడించారు.