యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి ఇన్చార్జి ఎరెక్షన్ బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు మౌలిక వసతులు కల్పన విద్యా వైద్యం ఉపాధి మహిళా సాధికారత వంటి అనేక రంగాలలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.