యర్రగొండపాలెం: చేపల చెరువులలో కోళ్ల వ్యర్ధాలను వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
చేపల చెరువులలో కోళ్ల వ్యర్ధాలను వేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెరువుల నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. త్రిపురాంతకం మండలం మేడేపి రెవెన్యూ ఇలాకాలోని ముడివేములకు పోవు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులో కోళ్ల వ్యర్ధాలు వేస్తున్న దృశ్యాలు స్థానికులకు కనపడ్డాయి. దీంతో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరారు.