కొండపి: కొండపి మండలం ముప్పవరం గ్రామంలో పొలం పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు
రైతులకు మేలు చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గురువారం కొండపీ మండలం ముప్పవరం గ్రామంలో పొలంపాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు. పాసు పుస్తకాలు పంపిణీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం సరిహద్దు రాళ్లపై కూడా వారి బొమ్మలు వేసుకుందని ఎద్దేవ చేశారు.