రాయదుర్గం: పట్టణంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించిన నాయకులు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా నాయకులు నాని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లు పెద్ద వన్నూరప్ప, డిష్ గోవిందు, షబ్బీర్, శ్రీనివాస్ రెడ్డి జకాతి కృష్ణ, వాల్మీకి పవన్ ల వేణుగోపాల్ తదితరుల ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి సాధించి అగ్ర దేశాల సరసన నిలిచిందన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం అన్నారు.