ఉరవకొండ: ఉరవకొండ లోని నెహ్రూ కాలనీలో ఓ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, మంటల్లో కాలిపోయిన వస్తువులు
ఉరవకొండ లోని నెహ్రూ కాలనీలో ఓ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు చెలరేగాయి. మంటలు అర్పడానికి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది శతవిధాల ప్రయత్నించారు. అయితే మంటలు అదుపులోకి రాలేదు. ఇంటిలోని విలువైన వస్తువులన్నీ ఖాలి బూడిదయ్యాయి. భారీగా నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.