రాయదుర్గం: పట్టణంలోని జామియా అన్వరుల్ ఉలూమ్ ప్రాంగణంలో ఈనెల 26 న ఉచిత ఖత్నా : అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ
రాయదుర్గం పట్టణంలో ఈనెల 26 న బళ్ళారి రోడ్డులోని మదరసా జామియా అన్వరుల్ ఉలూమ్ ప్రాంగణంలో ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ సభ్యులు తెలిపారు. కార్యదర్శి మహమ్మద్ షఫీ, అధ్యక్షులు బ్రెడ్ షర్మాస్, ఖాజీ మహమ్మద్ సైఫుల్లా శుక్రవారం మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన శిబిరంలో సుమారు 150 మంది బాలలకు ఉచిత ఖత్నా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మరింత మెరుగైన వైద్య సదుపాయాలతో అధిక సంఖ్యలో బాలలకు సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఈ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.