రాయదుర్గం: కణేకల్లులో ఇసుక ట్రాక్టర్ మీద వెళ్లడంతో పగిలిన తాగునీటి మెయిన్ పైప్ లైన్, వృధాగా పోతున్న తాగునీరు
కణేకల్లు మండల కేంద్రం సమీపంలో వేదవతి-హగరి నదిలో ఇసుక కోసం వెళ్లిన ఓ ట్రాక్టర్ తాగునీటి పైప్‌లైన్ మీదుగా వెళ్లడంతో పైప్ పగిలింది. ఫౌంటెన్‌ను తలపించేలా నీరు ఎగిసిపడి వృథాగా పోతోంది. ఆ నీటి ధారలోనే ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు తీసేందుకు డ్రైవర్, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మెయిన్ పైప్‌లైన్ పగిలిపోయి నీరు ఏటిపాలు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.