గిద్దలూరు: కంభం మండలం రావిపాడు గ్రామంలోని భీమ లింగేశ్వర స్వామి దేవస్థానంలో రెచ్చిపోయిన దొంగలు, హుండీలు పగలకొట్టి నగదు అపహరణ
మార్కాపురం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలోని శ్రీ భీమ లింగేశ్వర స్వామి దేవస్థానంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలోని మూడు హుండీలను పగలగొట్టి అందులో ఉన్న నగదుతో పాటు 13 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. ఆలయంలోని బీరువాని ధ్వంసం చేశారు. పగలగొట్టిన హుండీలను ఆలయం సమీపంలోని పంట పొలాలలో పడవేసి వెళ్లారు. చోరీ జరిగిందని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేపట్టారు.