విశాఖపట్నం: వినాయక మండపాల నిర్వాహకులతో సౌత్ ఏసీపీ కీలక సమావేశం
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నం సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు.