రాయదుర్గం: పట్టణంలో వినియోగదారులు రక్షణ చట్టంపై ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
రాయదుర్గం పట్టణంలో ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో "వినియోగదారుల రక్షణ చట్టం" పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ రీజినల్ చైర్మన్, ఎస్.సి, ఎస్.టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బోమ్మిశెట్టి వెంకట రమణ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం వాడే వస్తువుల్లో నాణ్యత లోపం ఉన్నా, వారంటీ అమలు చేయకపోయినా వినియోగదారుల్లో చైతన్యం లేక మోసపోతున్నారని తెలిపారు.