మార్కాపురం: శివరాంపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామము నాలుగు సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం మండలం శివరాంపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామము నాలుగు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గత ప్రభుత్వంలో భూకబ్జాలతో విధ్వంసం సృష్టించారని అన్నారు. దీంతో 14 మంది వీఆర్వోలు ఇద్దరూ ఆర్ఐలు ఒక ఎమ్మార్వో సస్పెండ్ అయినట్లు గుర్తు చేశారు.